NTV Telugu Site icon

Vemula Prashanth Reddy: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి ఆంక్షలు పెట్టడం ఎంతవరకు సమంజసం..?

Prashanth

Prashanth

Vemula Prashanth Reddy: నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా, రేషన్ కార్డులపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త పథకాన్ని స్వాగతిస్తున్నాం.. ఉపాధి హామీ కూలీలను ప్రామాణికంగా తీసుకోవడం ఒకే.. కానీ, వ్యవసాయ కూలీలు అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.. ఆత్మీయ భరోసాకు ఆంక్షలు పెట్టడం ఎంత వరకు సమంజసం?.. ప్రభుత్వ ఆంక్షలతో 10 శాతం మందికి మాత్రమే భరోసా.. 90 శాతం పథకానికి దూరం అవుతారు అని పేర్కొన్నారు. ఎన్నికల్లో మాట ఇచ్చినట్లు అందరు వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసా అమలు చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read Also: Amit Shah: ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. బీజేపీ నేతలతో అమిత్‌ షా!

అలాగే, కొత్త రేషన్ కార్డులకు జారీని స్వాగతీస్తున్నామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారుల ఆదాయ పరిమితి పెంచాలి.. గ్రామా సభల్లో లబ్దిదారులను ప్రకటించాలి.. ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3500 ఇస్తామన్నారు డిమాండ్ ఎక్కువగా ఉంది.. గృహ లక్ష్మీ లబ్దిదారులకు, ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నిజమైన అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలి.. గ్రామ సభల్లో అర్హులను ప్రకటించాలి అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.