NTV Telugu Site icon

Nizamabad Crime: నిజామాబాద్‌లో ఘరానా మోసం.. 18 పౌండ్ల కోసం రూ.2.75 లక్షల ఫ్రాడ్‌..

Nizamabad Crime

Nizamabad Crime

Nizamabad Crime: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాల బెడద పెరుగుతోంది. సోషల్ మీడియా, పార్ట్ టైమ్ జాబ్స్, ఫిషింగ్, ఫేక్ కస్టమర్ కేర్, లోన్ యాప్ వేధింపులు, ఉద్యోగం, వీసా, రుణాలు, గిఫ్ట్, లాటరీ మోసం, డేటా చోరీ, ఓఎల్‌ఎక్స్, క్వికర్, ఇతర మార్కెటింగ్ కంపెనీలు, క్రిప్టో పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. పెట్టుబడి, మ్యాట్రిమోని, ఇతర రకాల సైబర్ నేరాలతో బాధితుల ఫిర్యాదుతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఒక రకం సైబర్‌ మోసం వెలుగు చూసేలోపు మరొక రకం సైబర్‌ నేరాలకు తెరలేపుతున్నారు సైబర్‌ కేటుగాళ్లు. దీంతో దీనిపై దృష్టి సారించిన పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. అమాయకులను టార్గెట్‌ చేస్తూ సైబర్‌ కేటు గాళ్లు దోచుకుంటూ కొత్తతరం నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే నిజామాబాద్‌ లో చోటుచేసుకుంది.

Read also: Hyderabad Crime: భార్య భర్తల దొంగ అవతారం.. మెచ్చుకున్నారో మొత్తం దోచేస్తారు

నిజామాబాద్‌ జిల్లా ఎల్లంపేటకు చెందిన సంతోష్‌ కు ఓ వ్యక్తి ఫోన్‌ కాల్‌ చేశాడు. ఇంగ్లాండ్ కరెన్సీ పేరిట సంతోష్‌కు మాటలు కలిపాడు, నమ్మంచాడు. ఆన్ లైన్ లో ఇంగ్లాండ్ కరెన్సీ పంపుతమంటూ సంతోష్ కు తెలిపాడు. ఇంగ్లాండ్ కరెన్సీ అంటే ఇక్కడ భారీగా గిరాకీ ఉంటుందని నమ్మించడంతో డబ్బులకు ఆశపడ్డ సంతోష్‌ ఆలోచన లేకుండా సైబర్‌ కేటుగాళ్లకు విడదల వారీగా రూ.2.75లక్షలు పంపాడు. ఆతరువాత సంతోష్‌కు ఇంగ్లాండ్ కరెన్సీని ఆన్ లైన్ లో పంపామని చెప్పడంతో సంతోసంతో ఆన్ లైన్ లో చూడగా బిత్తర పోయాడు. ఆన్ లైన్ ద్వారా అతనికి 18 పౌండ్లు మాత్రమే ఉండటంతో వాళ్లకు కాల్ చేశాడు. స్పందన లేకపోవడంతో.. మోసపోయానని భావించిన సంతోష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య..

Show comments