Nizamabad: నిజామాబాద్ జిల్లా మోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. అయితే, రోడ్ బుచ్చన్నతో దగ్గర లక్ష రూపాయల చిట్టీ వేసింది జంగం విజయ. అయితే, చిట్టీ గడువు ముగిసినా.. డబ్బులు చెల్లించడంలేకపోవడంతో అతడిపై డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. పైసల కోసం నా పరువు తీస్తుందేమో అనే కారణంతో బుచ్చన్న తన పాలేరు నగేష్‌తో కలిసి సదరు మహిళను హత్య చేసి పూడ్చి పెట్టారు.
Read Also: Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాలో అట్రాక్షన్గా పూసలమ్మాయి..అసలు మైండ్లోంచి పొవట్లేదుగా!
ఇక, మద్యం మత్తుతో నీ తల్లి చనిపోయిందని రోడ్ బుచ్చన్న చెప్పడంతో జంగం విజయ కుమారుడు మనోహర్ పోలీసులను ఆశ్రయించాడు. అదృశ్యమైన 7 నెలలకు హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, రంగంలోకి దిగిన పోలీసులు మహిళను చంపి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశాన్ని జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. ఏడు నెలలు కావడంతో ఎముకలు, చీర మాత్రమే తవ్వకాల్లో బయట పడ్డాయి. కాగా, ఆ చీర జంగం విజయదే అని నిర్ధారించుకున్న పోలీసులు అక్కడే పోస్టుమార్టం చేశారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.