దేశంలో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకొంది. మైనర్ ఆడపిల్లలకు చాక్లెట్ల పేరుతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. చాక్లెట్లు ఇచ్చి ముద్దులు ఇవ్వాలంటూ మైనర్ బాలికలపై రవీందర్ కామంతో పైశాచిక ఆనందం పొందుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నగరంలోని సాయినగర్ లో గత కొన్ని రోజులుగా ఈ సంఘటన జరుగుతుండగా.. చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. నిందితుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు 4వ టౌన్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.