రోడ్లమీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. హెల్మెట్ పెట్టుకుని నడుపుతున్నా ఒక్కోసారి పోలీసులు ఆపి, తనిఖీలు చేస్తుంటారు. వాహన దారులంటే పోలీసులకు ఎంత అలుసో విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓఘటన నిరూపించింది. తనిఖీలు చేసే సమయంలో వారికి ఎదురు చెబితే ఎంతకైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.. బైక్ ఆపేవరకు ఉండకుండా నేరుగా అడ్డుగా రావడం, తాళాలు తీసుకెళ్లడం చేస్తుంటారు… ఇది ఏంటని ప్రశ్నిస్తే, రుబాబు చేస్తున్నారంటూ లాఠీకి పని చెబుతుంటారు. నర్సీపట్నం మున్నిపాలిటీ బలిఘట్టంలో ఆదివారం…
దేశంలో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకొంది. మైనర్ ఆడపిల్లలకు చాక్లెట్ల పేరుతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. చాక్లెట్లు ఇచ్చి ముద్దులు ఇవ్వాలంటూ మైనర్ బాలికలపై రవీందర్ కామంతో పైశాచిక ఆనందం పొందుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. నగరంలోని సాయినగర్ లో గత కొన్ని రోజులుగా ఈ సంఘటన జరుగుతుండగా.. చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. నిందితుడికి దేహశుద్ధి చేసిన…