Nizam College Student: నిజాం కళాశాల విద్యార్థులు సమ్మెకు దిగారు. సెమిస్టర్ ఫీజు చెల్లించలేదనే సాకుతో చాలా మంది విద్యార్థులను పరీక్ష రాకుండా అడ్డుకుంటున్నారని నిజాం కాలేజీ యాజమాన్యంపై ఆరోపించారు. ఫీజుల చెల్లింపు విషయంలో గతంలోనూ ఇదే పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు. అప్పుడు కూడా ఫీజు కట్టిన తర్వాతే పరీక్షకు యాజమాన్యం అనుమతి ఇచ్చిందని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. కానీ ఈసారి మాత్రం ఫీజు కట్టేందుకు సిద్ధంగా ఉన్నా యాజమాన్యం పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఫీజు చెల్లించాలని పదిరోజుల గడువు ఇస్తే నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించామని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. ఉన్న ఫీజు అంశాన్ని ముందుకు తెచ్చి సెమిస్టర్ పరీక్షలు రాయకుండా యాజమాన్యం అడ్డుకుంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Saindhav: ప్రేక్షకులు మెచ్చితే ‘సైంథవ్ 2’ కూడా తీస్తాం: వెంకటేష్
మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఫీజు చెల్లించిన విద్యార్థులు కూడా పరీక్షను బహిష్కరించారు. మొత్తం 15 మంది విద్యార్థులు సెమిస్టర్ ఫీజు చెల్లించలేదు. నిజాం కళాశాల యాజమాన్యం ఈ 15 మందిని పరీక్షకు అనుమతించలేదు. ఆ విద్యార్థులకు మద్దతుగా మిగిలిన విద్యార్థులు కూడా పరీక్షకు వెళ్లని విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఫీజు చెల్లించని 15 మంది విద్యార్థులను పరీక్షకు అనుమతిస్తేనే తాము కూడా పరీక్ష రాస్తామని విద్యార్థులు యాజమాన్యానికి అల్టిమేటం జారీ చేశారు. ఫీజు చెల్లించకుంటే పరీక్షకు అనుమతించేది లేదని యాజమాన్యం తేల్చిచెప్పడంతో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు మరింత ఆందోళనకు దిగడంతో నిజాం కళాశాల యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అబిడ్స్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విద్యార్థులను నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Telangana Speaker Election: స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. 14న ఎన్నిక..