Site icon NTV Telugu

Nitin Gadkari : రేపు రాష్ట్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

తెలంగాణలో రేపు పలు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ. 8 వేల కోట్ల వ్యయంతో నాలుగు వందల అరవై కిలోమీటర్ల పొడవు గల జాతీయ రహదారులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే ఇందులో రెండు జాతీయ రహదారులను ప్రారంభించనుండగా, 10 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేస్తారు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ కింద 7 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ బీజేపీ నేతలు వెల్లడించారు.

అయితే నితిన్ గడ్కరీ రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తెలంగాణ బీజేపీ సభను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంని ఈ కార్యక్రమానికి సమయం ఇవ్వాలని… ప్రోగ్రాంని ఫైనల్ చేయాలని గడ్కరీ కోరినా ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. దీంతో ప్రోగ్రాంని తానే ఫైనల్ చేసుకొని గడ్కరీ టైమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎవరైనా హాజరు అవుతారా లేదా అనే చర్చ జరుగుతోంది.

Exit mobile version