Site icon NTV Telugu

Telangana: బాబోయ్ పులి.. నిర్మల్ రైతులకు దడ పుట్టిస్తున్న బెబ్బులి..

Birmal

Birmal

Telangana: పులి అనే పేరు వింటేనే రైతులు బాబోయ్ అంటున్నారు. నిర్మల్ జిల్లాలో పులి సంచారం ప్రజలు గుండెల్లో దడ పుట్టిస్తుంది. కుంటాల మండలంలో పులి సంచరిస్తుండటంతో బయలకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. నిన్న కుంటాల మండలంలో సాయన్న అనే రైతుకు పులి కనిపించింది. దీంతో రైతు భయంతో పరుగులు పెట్టాడు. రైతుల ప్రాణాలతో బయట పడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పులి జాడ కోసం జెల్లెడ పెట్టి గాలిస్తున్నారు. మహా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి సూర్యా పూర్ అటవీ ప్రాంతంలోకి పులి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పులి పాదముద్రలు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి జాడకోసం కెమెరా ట్రాప్ లను బిగించారు. చెరువు వద్దకు వచ్చి పులి వెళ్లినట్లు కెమెరాలో కనిపించింది. దీంతో అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు. పులి కదలికలను క్షేత్రస్థాయిలో గమనిస్తున్న ఫారెస్ట్ సిబ్బంది. కొద్దిరోజులుగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం శివారులలో పులి తిరిగినవిషయం తెలిసిందే. అటు మహారాష్ట్ర బార్డర్ వెళ్లి మళ్లీ కుంటాల మండలంలోని సూర్యపూర్ శివారు లోకి పులి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. మూడు రొజులుగా కుంటాల మండల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల వరుసగా పశువులపై బెబ్బులి పంజావిసురుతున్న విషయం తెలిసిందే. గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Allu Arjun : బన్నీ – శ్రీలీల స్పెషల్ సాంగ్ క్రేజి అప్డేట్..

Exit mobile version