NTV Telugu Site icon

Nirmal: సమగ్ర కుటుంబ సర్వేకు దూరంగా ఆ గ్రామాలు.. కలెక్టర్ కీలక ప్రకటన

Comprehensive Family Survey

Comprehensive Family Survey

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేపై వివిధ శాఖల అధికారులతో చర్చించడం జరిగిందని.. ఈ సర్వే పూర్తిగా ప్రభుత్వపరంగా చేపడుతున్నదని.. సర్వే ఆధారంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయబడతాయని అన్నారు. కావున ఈ సర్వేలో ప్రజలందరూ స్వచ్చందంగా భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కొన్ని గ్రామాలలో సర్వేను బహిష్కరించడం సరికాదని.. జిల్లాలో వివిధ కారణాలతో సర్వేను బహిష్కరించిన, అడ్డుకునే ప్రయత్నం చేసిన సంబంధిత వారిపై చర్యలు కఠిన ఉంటాయని కలెక్టర్ తెలిపారు.

Read Also: Rain Alert: ఈ నెల 12,13, 14 తేదీల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో మోస్తరు వర్షాలు!

సమగ్ర కుటుంబ సర్వే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని.. సర్వే పై ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ప్రజలందరూ సర్వేలో తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ కోరారు. సర్వే నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి వివిధ వర్గాల వారు అభినందనలు తెలియజేస్తూ ఈ సర్వేను తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే హౌస్ లిస్టింగ్ పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. సర్వేపై ఎటువంటి సందేహాలున్నా క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దారులు, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సర్వేకు సహకరిస్తున్న ప్రజలందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలుపుతూ.. ఎన్యుమరేటర్లకు, సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి సహకరించాలని ప్రజలను కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

Read Also: Viral Video: విరాట్‌ కోహ్లీని చూడగానే అతడి చేతిని పట్టుకుని మహిళ ఏం చేసిందో చూడండి(వీడియో)