NTV Telugu Site icon

UBIT Coin Case: యూబిట్ కాయిన్ కేసు పై ఈడీ నజర్.. నిర్మల్ పోలీసులకు లేఖ..

Ubit Coine

Ubit Coine

UBIT Coin Case: యూ బిట్ కాయిన్ కేసు పై ఈడీ దృష్టి సారించింది. నిర్మల్ జిల్లా లో నమోదు అయిన కేసు వివరాలు కావాలని నిర్మల్ జిల్లా పోలీసులకు ఈడీ లేఖ రాసింది. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరుతో నకిలీ యాప్‌ల ద్వారా రూ.కోట్లు దోచుకున్న ముఠా కార్యకలాపాలపై విచారణ జరుపుతోంది. నిర్మల్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటనలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా అనుమానిస్తుంది. ఈనేపథ్యంలో ఈడీ లోతుగా విచారణ జరుపుతోంది. నిందితుల ఎఫ్‌ఐఆర్‌, రిమాండ్‌ రిపోర్టులు, బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలను సమర్పించాలని నిర్మల్‌ పోలీసులకు ఇటీవల లేఖ రాశారు. వివరాలను సేకరించిన తర్వాత, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక (ECIR) నమోదు చేసిన అనంతరం దర్యాప్తు ప్రారంభించనున్నట్లు సమాచారం.

Read also: Onion Peel: చెత్త బుట్టలో పడేసే ఉల్లి పొట్టుతో పుట్టెడు లాభాలు

ఒక్క నిర్మల్ ప్రాంతంలోనే దాదాపు రూ.50 కోట్లు దోచుకున్నట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆ డబ్బును ఎక్కడికి తరలించారు? ఏమి చేసారు? అలాంటి వివరాలతో పాటు ఆ డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిని జప్తు చేసేందుకు కూడా ఈడీ సిద్ధమవుతున్నట్లు విశ్వనీయ సమాచారం. నిర్మల్‌తోపాటు ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాలకు ఈ ముఠా విస్తరించినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎక్సైజ్ ఎస్సై, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, కానిస్టేబుల్‌ లను గత నెల (సెప్టెంబరు) 25న అరెస్టు చేశారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏజెంట్లుగా చేరినట్లు గుర్తించారు. ఏజెంట్లు వసూలు చేసిన సొమ్మును తొలుత ఢిల్లీలోని ముఠా సభ్యులకు పంపించి క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయికి పంపినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ రెండు రోజుల క్రితం నిర్మల్ పోలీసులకు లేఖ రాసింది.
Iron Wire in Biscuit: బిస్కెట్ లో ఇనుప తీగ.. పిల్లలు జాగ్రత్త అంటూ వీడియో షేర్‌ చేసిన ఓ తండ్రి..