Site icon NTV Telugu

Nirmal Crime: రన్నింగ్‌ బస్సులో మహిళపై అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి..!

Hyderabad Crime

Hyderabad Crime

Nirmal Crime: మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను ఒంటరిగా చూస్తే చాలు.. వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు మాత్రం ఆగడం లేదు. కదులుతున్న బస్సులో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నోటికి గుడ్డ పెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులో వచ్చింది. ఈ సంచలన ఘటన నిర్మల్ లో కలకలం రేపుతుంది.

Read also: Friends Rape: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై స్నేహితుల సామూహిక అత్యాచారం.. హోటల్ కు తీసుకుని వెళ్లి..

హరికృష్ణ ట్రావెల్ నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తుండగా ఓ మహిళ బస్సులో ఎక్కింది. అయితే అందులో ఇద్దరు డ్రైవర్లు మాత్రమే వున్నారు. ఎవరూ లేకపోవడంతో ఆ మహిళ ఇది ప్రకాశం వెళుతుందా? అని ప్రశ్నించింది. ప్రకాశం వెలుతుందని డ్రైవర్ తెలుపడంతో సీటులో కూర్చింది. అయితే బస్సులో ఎవరూ లేకపోవడం.. ఒంటరి మహిళ కావడంతో ట్రావెల్‌ డ్రైవర్‌ బస్సు అద్దాలను అన్నింటి క్లోజ్‌ చేశాడు. ఇది ఏసీ బస్సు అని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె ఏమీ చెప్పలేకపోయింది. ఇద్దరు డ్రైవర్లు ఒక చోట బస్సును ఆపి ఆమె వద్దకు వచ్చారు. ఆమె పట్టుకుని నోట్లో గుడ్డను కుక్కారు. అయితే ఎవరికి అనుమానం రాకుండా.. ఒకరు బస్సును డ్రైవింగ్‌ చేస్తుండగా మరొకరు ఆమెపై అత్యాచారం చేశాడు. కదులుతున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ ఈ దారుణానికి ఒడికడ్డాడు.

Read also: Telangana Assembly: నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దు.. సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి..

బస్సు ప్రయాణిస్తుండటంతో ఎవరికి ఏ అనుమానం కలగలేదు. అత్యాచారం అనంతరం బస్సు మధ్యలో ఆపి ఆమెను కిందికి దించి.. ఎవరికి చెప్పకూడదని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే ఆ మహిళ డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. తనపై డ్రైవర్ అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్ ఉండగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో అప్రమత్తమైన సిటీ పోలీసులు బస్ కోసం గాలింపు చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. హరికృష్ణ ట్రావెల్ సంబంధించిన ఇద్దరు డ్రైవర్లని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరిక్షలకోసం బాధితురాలిని హస్పటల్ కు తరలించారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీని ప్రొరోగ్ చేసిన గవర్నర్.. సర్కార్‌కు లైన్‌ క్లియర్‌

Exit mobile version