Site icon NTV Telugu

Niranjan Reddy : అంతటి మూర్ఖున్ని ఎక్కడా చూడలేదు..

Niranjan Reddy

Niranjan Reddy

ఒక మూర్ఖుడు తెలంగాణకు ఎన్టీఆర్ పరిపాలించే వరకు వరి అన్నం తెలియదు అంటున్నాడని.. అంతటి మూర్ఖున్ని ఎక్కడా చూడలేదంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 1100 ,1200 ఏళ్ల క్రితమే తెలంగాణలో వరి సాగయిందని ఆయన వివరించారు. దానికి కొనసాగింపు కాకతీయ, రెడ్డి రాజుల కాలంలో గొలుసుకట్టు చెరువుల కింద వరి సాగయిందన్నారు. చరిత్ర తెలియని మూర్ఖులు ఎన్టీఆర్ వచ్చాకనే వరి అన్నం తెలిసిందని అంటున్నారని ఆయన మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో పాలకుల వివక్ష, మూర్ఖపు పాలన కారణంగా గొలుసుకట్టు చెరువులు దెబ్బతిని తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొన్నదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలోని గ్రామాలు నివాస యోగ్యంగా మారాయన్నాయన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.
Also Read : China: భారత్-అమెరికా మిలిటరీ డ్రిల్స్‌పై చైనా అక్కసు.. భారత సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్

ఉపాధి అవకాశాలు పెరిగితే ఊర్లు స్వయం సమృద్ధి సాధిస్తాయన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. సాగునీటి వసతితోపాటు, 24 గంటల ఉచిత కరెంటు అందిస్తుండటంతో బీళ్లన్నీ పొలాలుగా మారుతున్నాయన్న నిరంజన్‌ రెడ్డి.. దీంతో గ్రామాల్లో దారులు సమస్యగా తయారయ్యాయన్నారు. కాగా, తుల్పునూరుకు చెందిన రుక్మాకర్‌ రెడ్డిని అభినందించారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. 35 ఏండ్ల తర్వాత అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చిన రుక్మాకర్‌.. మేకలు పెంచుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. దళితబంధులో కూడా ఇలాంటి యూనిట్లు అందిచవచ్చని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version