NTV Telugu Site icon

Coronavirus: క‌రోనా అల‌జ‌డి.. తెలంగాణలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు

Positive Cases

Positive Cases

మరోసారి క‌రోనా అల‌జ‌డి మ‌ళ్లీ మొద‌లైంది. కొవిడ్ కొత్త వెరియంట్ జేఎన్-1 కారణంగా క్రమంలో దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో సైతం కరోనా విజృంభిస్తోంది. కేసులు మ‌ళ్లీ న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలిసి రాష్ట్రంలో 27 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్‌లో వెల్లడించారు. అలాగే ఒక‌రు రిక‌వ‌రీ అయ్యారు. కాగా ఈ రోజు తెలంగాణలో 1245 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.

Also Read: Coronavirus: కరోనా కలకలం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు

అయితే తాజాగా న‌మోదైన తొమ్మిది కేసుల్లో 8 మంది హైద‌రాబాద్, ఒక‌రు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. ఇంకా 68 మంది రిపోర్ట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ‌లో రిక‌వ‌రీ రేటు 99.51 శాతంగా ఉంది. నిలోఫ‌ర్‌లో రెండు నెల‌ల చిన్నారికి క‌రోనా నిర్ధార‌ణ కాగా, ఆ పాప‌కు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్‌లో ఆరు శాంపిల్స్ ఆర్‌టీపీసీటీ టెస్ట్ పంపగా.. రెండు పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో భూపాలపల్లి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుస్తు చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలో 100 పడకల కరోనా వార్డు ఏర్పాటు చేశారు.

Also Read: Rashmika Mandanna: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రష్మిక..