NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
- రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ ఆపరేషన్లు
- 90% శస్త్రచికిత్సలు పేదలకు ఉచితం
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో విస్తరించనున్న రొబోటిక్ సేవలు
- నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించిన సీఎం, మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIMS : హైదరాబాద్‌లోని నైజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. కేవలం రెండున్నర సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలసి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ వైద్యులను, నర్సింగ్ అధికారులను, సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఉచితంగా 90 శాతానికి పైగా శస్త్రచికిత్సలు
నిమ్స్‌లో ఇప్పటివరకు నిర్వహించిన వెయ్యి రొబోటిక్ సర్జరీలలో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో 248, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. అత్యంత ఖరీదైన ఈ రొబోటిక్ శస్త్రచికిత్సలలో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పథకాల ద్వారా పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందించడం విశేషం.
Also Read
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక రొబోటిక్ సేవలు
దక్షిణ భారతదేశ ప్రభుత్వ రంగంలో తొలి రొబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిర్వహించిన ఘనత నిమ్స్దేనని మంత్రి దామోదర్ రాజనర్సింహ గుర్తుచేశారు. ఇటీవలే 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు 1,000 రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరడం ప్రభుత్వ వైద్య సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం నిమ్స్‌తో పాటు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రోజుల్లో గాంధీ, కొత్త ఉస్మానియా, నిర్మాణం పూర్తికావస్తున్న టిమ్స్ (TIMS) ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక రొబోటిక్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సేవలను పేదలకు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలోనే 1,000 రొబోటిక్ ఆపరేషన్లు పూర్తి చేసిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్యుల బృందం, ఆపరేషన్ థియేటర్, నర్సింగ్ సిబ్బందికి సీఎం తన అభినందనలు తెలిపారు. వివిధ వైద్య విభాగాలు, అనస్థీషియా, నర్సింగ్ టీమ్స్ సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని నిమ్స్ డైరెక్టర్ పేర్కొన్నారు. వైద్యరంగానికి పూర్తి సహకారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?