NTV Telugu Site icon

Srinivas Goud: హైదరాబాద్‌కు చేరుకున్న నిఖత్‌ జరీన్‌.. స్వాగతం పలికిన శ్రీనివాస్‌గౌడ్‌

Srinivas Goud

Srinivas Goud

Srinivas Goud: ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించింది. ఈ క్రమంలో ఆమె తొలిసారిగా హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ కుటుంబ సభ్యులు…శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం అందుకున్నారు. ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో నృత్యాలు చేసి మరీ నిఖత్‌కి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌లో రెండోసారి బంగారు పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన గెలుపునకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తుంది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు శుభాకాంక్షలు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో వియత్నాం బాక్సర్ నుయెన్‌పై 5-0 తేడాతో విజయం సాధించి భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన నిఖత్ జరీన్ తెలంగాణకు గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. నిఖత్ జరీన్ తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తన కెరీర్‌లో ఇది రెండో బంగారు పతకం కావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా తమ కృషి కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Ghattamaneni Fans: మే 31న మొట్టమొదటి ఇండియన్ కౌబాయ్ సినిమా రీరిలీజ్

Show comments