Site icon NTV Telugu

Hyderabad: నేడు హైదరాబాద్‌ రానున్న బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌

Nikhil Jarin

Nikhil Jarin

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్ ఇవాళ హదరాబాద్‌ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నది. దీంతో తెలంగాణ ఆణిముత్యానికి ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందూరు బిడ్డకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలుకనున్నారు.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లో నిఖత్‌ జరిన్‌ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఫైనల్స్‌లో 52 కేజీల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్‌ జిటిపాంగ్‌ను 0-5తో చిత్తు చేసి బంగారు పతకం అందుకున్నది. దీంతో మేరీకోమ్‌, సరితా దేవి, జెన్నీ, లేఖ తర్వాత ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా జరీన్‌ నిలిచింది.

Corona Update: భయపెడుతున్న ఫోర్త్ వేవ్… 24 గంటల్లో 2710 కరోనా కేసులు

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్ నిలిచింది. యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (25) చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో థాయిలాండ్ బాక్సర్‌పై విజయం సాధించి, స్వర్ణ పతకం చేజిక్కించుకొని భారత్ తరఫున కొత్త చరిత్ర లిఖించింది. 5-0 తేడాతో థాయిలాండ్ బాక్సర్‌ని ఓడించి స్వర్ణాన్ని అందుకుంది. తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది.

జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌ ఇప్పటికే చరిత్ర సృష్టించింది. ఇప్పుడు సీనియర్‌ స్థాయిలోనూ తొలిసారి టైటిల్‌ను ముద్దాడి కొత్త చరిత్ర లిఖించింది. రింగ్‌లో సివంగిలా చెలరేగిపోయి అభిమానుల మనసులను గెలుచుకుంది. గురువారం (మే 19) న తుది పోరులో 52 కేజీల విభాగంలో థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామస్‌ను ఓడించింది.

మహిళల బాక్సింగ్‌లో భారత్‌ ఇప్పటివరకూ ఆరుసార్లు స్వర్ణ పతకం దక్కించుకుంది. మేరీకోమ్‌, సరితాదేవి, ఆర్‌.ఎల్‌. జెన్నీ, లేఖ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. ఇప్పుడు ఆ జాబితాలో ఐదో బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ చేరింది.

Exit mobile version