NTV Telugu Site icon

Pudding and Mink Pub Drugs Case: డ్రగ్స్ కేసు.. వెలుగులోకి కొత్త కోణాలు..

Pudding And Mink

Pudding And Mink

తెలంగాణలో సంచలనం సృష్టించిన పుడ్డింగ్‌ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి… పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌కు టోనీ ఎంజెంట్లు డ్రగ్స్ చేరవేసినట్టు ఆధారాలు లభించాయి.. టోనీ ఏజెంట్లు బాబు షేక్, నూర్ మమ్మద్‌.. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌కు డగ్ర్స్‌ సప్లై చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.. దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని డ్రస్ దందా చేస్తున్నారు నైజీరియాకు చెందిన టోనీ.. ఇక, టోనీ ప్రధాన ఏజెంట్ ముంబై బాబు షేక్ రెండేళ్లుగా హైదరాబాద్‌కి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.. 3 నెలలు క్రితమే టోనీతో కొకైన్ సరఫరా చేసే సహా 22 మంది నిందితులు, డ్రగ్స్ వినియోగించే వారిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Read Also: KTR: మతం పేరుతో రాజకీయాలు.. విధ్వంసకర శక్తులను ఒక కంట కనిపెట్టండి..!

మరోవైపు, పబ్ నిర్వాకుడు అభిషేక్ విదేశీ పర్యటనలపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు, క్రీడలు ఇష్టం ఉండడంతోనే క్రికెట్, ఫుట్ బాల్ మ్యాచ్‌లకి విదేశాలకు వెళ్లినట్టు అభిషేక్‌ చెబుతుండగా.. అభిషేక్, అనిల్‌ను నాలుగు రోజులు పాటు కష్టడీలోకి తీసుకుని విచారించారు పోలీసులు.. ఇక, వారికి న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో, బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిందితులు.. ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఇక, విచారణ సమయంలో సాంకేతిక ఆధారాలను ముందు పెట్టి నిందితులను పోలీసులు ప్రశ్నించారు.. వాట్సప్‌లో టోనీ.. ఎంజెంట్ బాబు షేక్‌తో చాట్‌ చేసినట్టుగా గుర్తించారు.. కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు ఆధారంగా విచారణ జరిగింది. ఇక, ఈ కేసులో మరెన్ని లింకులు, కీలక విషయాలు వెలుగు చూస్తాయో చూడాలి.