TS Corona: తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కరోనా పుట్టినిల్లు చైనాలో సైతం కరోనా కేసులు భారీగా నమోదువుతుండడంతో కఠిన లాక్డౌన్ నిబంధనలు అమలు చేశారు. దీంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే భారత్‌లో కూడా థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటు ఫోర్త్ వేవ్ వచ్చిన ఎదుర్కొనగలమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 485 మందికి పాజిటివ్‌గా తేలింది. 27,130 మందికి వైద్యులు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా బారి నుంచి బుధవారం 236 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,421 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణలో ఇప్పటివరకు 8,00,476 కొవిడ్ కేసులు బయటపడగా, 7,91,944 మంది వైరస్‌ను జయించారు. మొత్తం 4,111 మందిని మహమ్మారి పొట్టన పెట్టుకుంది. హైదరాబాద్‌లో కొత్తగా 257, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 37, సంగారెడ్డిలో 73, రంగారెడ్డి జిల్లాలో 58, ఖమ్మం జిల్లాలో 10 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
- Harish Rao : రేవంత్‌కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
-
Bhatti Vikramarka : తప్పుడు ప్రచారాలు మానండి.. రైతులకు ఉచిత కరెంట్ ఆగదు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!