NTV Telugu Site icon

Praneeth Hanumanthu: తండ్రీ కూతుళ్లపై అనుచిత వ్యాఖ్యలు.. నటుడిపై కేసు

Praneeth

Praneeth

Praneeth Hanumanthu: ఇటీవల సుధీర్ బాబు నటించిన ‘హరోమ్ హర’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుధీర్ బాబు కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించింది. అలానే ఈ సినిమాలో సెల్వ మాణికాయం బుజ్జులుగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రణీత్ హనుమంతు నటించాడు. యాక్షన్ థ్రిల్లర్‌లో అతని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.అయితే తెలియని వారికి, ప్రణీత్ యాక్టర్ కంటే కంటెంట్ సృష్టికర్తగా నెటిజన్లలో ఎక్కువ గుర్తింపు పొందాడు. తెలుగు సినిమాలను రెగ్యులర్‌గా తిడుతూ టాలీవుడ్‌లో ఫోజులు కొడుతున్నాడంటూ నెటిజన్లు అతనిపై విమర్శలు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మహేష్ బాబు వంటి అగ్ర నటుల అభిమానులు ప్రణీత్ హనుమంతును ట్రోల్ చేస్తూ ఉంటారు.తాజాగా పేదోడు జోక్స్, ఇన్‌సెస్ట్ హాస్యం పేరుతో తండ్రీ కూతుళ్ల సంబంధంపై ప్రణీత్ హనుమంతు, మరో ఇద్దరితో కలిసి అసభ్య కామెంట్లు చేశారు.

Also Read: Mahua Moitra: మరో వివాదంలో ఎంపీ మహువా మోయిత్రా.. కేసు నమోదు..

ఒక తండ్రి తన కూతురితోతో సరదాగా వీడియో చేయగా.. దానిపైన కొంతమంది యూట్యూబర్స్ డార్క్‌ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. తండ్రీ కూతుళ్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోక్సో చట్టం కింద ప్రణీత్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేశారు. ఇంతలో, ప్రణీత్ వీడియో నుంచి అసభ్యకర వ్యాఖ్యలను తొలగించాను. దీనిపై క్షమాపణలు చెబుతున్నాను. కంటెంట్ క్రియేటర్‌గా నా ప్రయత్నం అందరిని సంతోషంగా ఉంచడమే. కానీ ఈ సారి గీత దాటాను. అని క్షమాపణలు కోరుతూ ప్రణీత్ ట్వీట్ చేసాడు .

Show comments