Site icon NTV Telugu

Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

Konda Surekha

Konda Surekha

Konda Surekha : మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఇటీవల మంత్రి సురేఖ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతోంది.

Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. హసీనా పదవీచ్యుతి తర్వాత తొలి ఎలక్షన్స్..

అయితే.. నిర్దేశించిన తేదీన విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడంతో, కోర్టు కఠినంగా స్పందించింది. హాజరు నిర్లక్ష్యం చేసినందుకు ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు వెలువరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని పోలీసులకు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది.

Telangana Rising Global Summit : గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి రెండో రోజున పెద్దఎత్తున సందర్శకులు

Exit mobile version