NTV Telugu Site icon

Vaishali Kidnapping Case: నవీన్‌ రెడ్డి సోదరుడు సందీప్‌ రెడ్డి అరెస్ట్‌.. వీడియోలను రికార్డు చేసి..

Vaishali, Naveenreddy

Vaishali, Naveenreddy

Vaishali Kidnapping Case: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్‌రెడ్డి అరెస్ట్‌ చేశారు పోలీసులు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సర్క్యులేట్‌ చేశారని, గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసి మీడియాకు పంపారనే పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావడంతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిలను అదుపులో తీసుకున్నారు. వైశాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగి ఆదిభట్ల పోలీసులు నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. మీడియాలో వైశాలి వీడియోలు ప్రసారం చేయొద్దని పోలీసుల సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు హెచ్చరించారు.

ఇదిలా వుండగా వైశాలి కిడ్నాప్‌ కేసులో ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. భాను ప్రకాశ్‌, సాయినాథ్‌, ప్రసాద్‌, హరి, విశ్వేశ్వర్‌ లను ఒకరోజు కస్టడీకి అనుమతించింది ఇబ్రహీంపట్నం కోర్ట్‌. న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్లపల్లి జైలు నుంచి నిన్న (శుక్రవారం) ఐదుగురిని కస్టడీకి తీసుకున్నారు ఆదిభట్ల పోలీసులు.

Read also: Bharat Series Registrations: భారత్ సిరీస్ నెంబర్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అయితే హైదరాబాద్‌ శివార్లో బీడీఎస్‌ విద్యార్థిని వైశాలి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డితో పాటు మరో ఐదుగురు నిందితులకు ఇబ్రహీంపట్నం కోర్టు 14రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది. మంగళవారం గోవాలో నవీన్‌ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.. నవీన్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించి, అతని సహచరులను హైదరాబాద్‌ శివార్లలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్ష అనంతరం నవీన్‌రెడ్డిని అతని ఐదుగురు సహచరులను ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరిని జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో నవీన్‌రెడ్డిని, అతని సహచరులను పోలీసులు చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు తరలించారు. అయితే ఈకేసులో ఇప్పటి వరకు 38 మంది నిందితులను అదుపులో తీసుకున్నారు.

నవీన్‌రెడ్డి స్టేట్‌ మెంట్‌లో కీలక అంశాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. బ్యాడ్మింటన్‌ ఆడేటప్పుడు వైశాలి నాకు పరిచమైంది. నేను ప్రేమిస్తున్నట్లుగా వైశాలికి చెప్పాను. వైశాలి నా ప్రేమను నిరాకరించింది. అయితే వైశాలి తండ్రి దగ్గరికి ప్రేమ, పెళ్లి ప్రపోజల్‌ తీసుకువెళ్లాను అయితే ఆమె కుటుంబ సభ్యులు నా ప్రపోజల్‌ను ఒప్పుకోలేదు అన్నారు. వైశాలిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే వైశాలి వేధించడం మొదలుపెట్టాను అన్నాడు. ఇక నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌తో ఫోటోలు, వీడియోలు పెట్టానని అతను చెప్పాడు. అయితే నవీన్‌ రెడ్డి సన్నిహితులు రెమెన్‌, పవన్‌ ఇప్పటికీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికోసం ప్రత్యేకబృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Team India: నాలుగేళ్ల తర్వాత సెంచరీ చేసిన పుజారా.. వేగంగా కూడా..!!