Site icon NTV Telugu

Warangal Modi Ganesh: వరంగల్ లో మోడీ గణపతి.. బీజేపీ నేత కొండంత అభిమానం

Wgl Modi Ganesh

Wgl Modi Ganesh

ఇప్పుడంతా గణేష్ చవితి సందడి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గణేష్ విగ్రహాలను తెచ్చి మంటపాల్లో వుంచి పూజలు చేస్తున్నారు. వాడవాడలా గణేష్ పూజలతో హడావిడి చేస్తున్నారు భక్తులు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ రకాల గణపతి ఉత్సవ మూర్తులు భక్తులను ఆకర్షిస్తున్నాయి వరంగల్ ప్రజలు ఈ సంవత్సరం కాలుష్య రహిత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం నగర ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సాధ్యమయినంత వరకూ మట్టితో చేసే విగ్రహాలు చాలాచోట్ల కొలువయ్యాయి.

పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చేలా మట్టి గణపతి విగ్రహాలు నెలకొల్పారు. వివిధ రూపాలలో తయారుచేసిన గణపతి విగ్రహాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రెండ్ నడుస్తుంది. అందుకు తగ్గట్టుగా వరంగల్ జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి వెరైటీగా గణపతి విగ్రహాన్ని తయారుచేయించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గణపతిని భుజాలపై ఎత్తుకొని భూలోకానికి తీసుకొస్తున్న ప్రతిమ శివనగర్ లో భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నరేంద్ర మోడీపై ప్రేమతో ప్రత్యేకంగా వెరైటీ గణపతిని తయారు చేయించారని గణపతి తయారీదారులు అంటున్నారు. నరేంద్ర మోడీ వినాయకుడు ఇప్పుడు వైరల్ అవుతున్నాడు. ఈ వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు.

వినాయక చవితి ఉత్సవాల్లో కొత్తదనానికి పెద్ద పీట వేశారు. వివిధ రూపాల్లో ప్రతిమలను ప్రతిష్టించేంచేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఈసారి వినాయక చవితి ఉత్సవాల్లో ట్రెండ్ కు తగ్గట్లుగా లంబోదరుడి విగ్రహాల తయారీకి సంబంధించి ముందుగా ఆర్డర్ తీసుకుని వివిధ రూపాలను తయారు చేసారు. వరంగల్ నగరంలోని శివనగర్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు ప్రదానీ మోదీ రూపంలో ఉండే బొజ్జగణపతి విగ్రహం తయారు చేయించి మండపాల్లో ప్రతిష్టించారు. ఆ గణపతిని మండపానికి తరలించి.. …మండపాల్లో ప్రతిష్టించిన తరువాత పూజలు చేస్తామని ఉత్సవ కమిటీ నిర్వహకులు చెప్పారు.మోదీ రూపంలో గణనాథుడి విగ్రహం మట్టితో తయారు చేసామని..ఈ అవకాశం తమకు రావటం సంతోషంగా ఉందని తయారీ దారుడు రాజేందర్ చెబుతున్నారు.

Read Also: HariHara Veeramallu: ఫ్యాన్స్ సిద్ధంకండి.. పవర్ ప్యాక్డ్ టీజర్ లోడింగ్..

Exit mobile version