NTV Telugu Site icon

Narayana: ప్రజలపై ప్రేమ కాదు.. ఓట్లు అడుక్కోవడమే

Narayabjp

Narayabjp

తెలంగాణలో హోంమంత్రి అమిత్ షా పర్యటన విజయవంతం అయిందని బీజేపీ నేతలు చంకలు గుద్దుకుంటుంటే..విపక్షాలు మాత్రం విరుచుకుపడుతున్నాయి. అమిత్ షా హైదరాబాద్ రాజకీయ పర్యటనపై మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. వొక్కసారి గెలిపించండి ప్లీజ్ అంటూ వీరోచితంగా పర్యటన సాగించి అమిత్ షాను ఆహ్వానించి అట్టహాసంగా బహిరంగసభ పెట్టి దీనంగా “వొక్కసారి ” అంటే వురి వొక్కసారే వేశారంటే చాలు రెండోసారికి అవకాశం వుండదు అన్నట్టుగా నారాయణ తనదైన రీతిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

బీజేపీని తెలంగాణాలో ఒక్కసారి గెలిపిస్తే అదే అవుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీ సభ జయప్రదం అయ్యింది . అయితే “ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్” అన్నట్టు తెలంగాణాకు విభజన చట్టంలో ఇచ్చిన హామీల జోలికే వెళ్ళలేదు . దీన్నిబట్టి తెలుగు ప్రజలపై ప్రేమకన్నా ఓట్ల యాచకత్వమే మిన్న అన్నట్టుగా వుందన్నారు. ఈసభ జయప్రదం కావడానికి కేసీఆర్ రాజకీయ వైఖరి కారణం కాదా ???

కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రజావ్యతిరేక చట్టాలను kcr సమర్దించలేదా ?MIM తో మీకున్న రాజకీయ సంబంధాలవలన bjp బలం పెంచుకోవడానికి TRS అవకాశం కల్పించలేదా ???రాష్ట్రంలో రాజకీయ ప్రజాస్వామ్యం కల్పించకపోగా ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచనలు చేయలేదా ??

లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్తను బలహీన పరిస్తే ఆస్థానాన్ని భర్తీ చేయడానికి బీజేపీకి అవకాశం ఇచ్చిందెవరు? టీఆర్ఎస్ రాజకీయ తప్పిదాల ఫలితంగా తెలంగాణాలో బలమయిన ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజలకు నష్టం కలుగుతోంది. ఇప్పటికైనా ద్వంద రాజకీయ విధానాలకు స్వస్తి చెబితే ప్రజలకు మేలు చేయగలరు. లేకుంటే ఒక్కసారి ఓటు ఒక్కసారి వురికిసహకరించిన వారవుతారు అంటూ ప్రకటన విడుదల చేశారు సీపీఐ నేత నారాయణ.

Hyderabad: హరీష్‌ రావు ట్వీట్‌కు బీజేపీ శ్రేణుల కౌంటర్‌