NTV Telugu Site icon

Nampally Court Judge: నాంపల్లి కోర్టు జడ్జి ఆత్మహత్య.. ఆమెతో చెప్పి మరీ బలవన్మరణం

Nampalli Gudeg Susaide

Nampalli Gudeg Susaide

Nampally Court Judge: నాంపల్లి ఎక్సైజ్‌ ప్రత్యేక జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి ఎ.మణికంఠ(36) భార్యతో గొడవలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబం బాగ్ అంబర్‌పేటలోని పోచమ్మబస్తీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌కు చెందిన లావణ్యతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి విశ్వనాథ్ (5) అనే కుమారుడు ఉన్నాడు. అంబర్ పేట ఇన్ స్పెక్టర్ అశోక్ కేసు నమోదు చేసుకున్నారు.

Read also: Astrology: మార్చి 25, సోమవారం దినఫలాలు

మణికంఠ, అతని భార్య మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయని అంబర్ పేట ఇన్ స్పెక్టర్ అశోక్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం లావణ్య కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఇటీవల మణికంఠ తల్లికి ఆరోగ్యం బాగోకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. మణికంఠ తండ్రి తన భార్యను చూసుకుంటూ ఆసుపత్రిలో ఉన్నాడు. ఓ వైపు తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించి ఆస్పత్రిలో ఉండగానే మరోవైపు భార్య కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లడంతో మనకంఠ మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం భార్యకు ఫోన్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మణికంఠ తాను బతకలేనని, ఆత్మహత్య చేసుకుంటానని భార్యకు ఫోన్‌లో చెప్పాడు.

Read also: RCB vs PBKS: నేడు ఆర్సీబీతో పంజాబ్ ఢీ..

అంతే క్షణికావేశానికి లోనైన మణికంఠ బెడ్ రూంలోకి వెళ్లి తలుపులు వేసి భార్య చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఆయన బయటకు రాకపోవడం, తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తలుపులు పగలగొట్టి చూడగా మణికంఠ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మణికంఠ మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉస్మానియా మార్చురీకి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణికంఠ మృతితో కుటుంబంలో విషాధం నెలకొంది.
EPFO : జనవరిలో ఈపీఎఫ్ఓలోకి ఎనిమిది లక్షలమంది కొత్త సభ్యులు

Show comments