NTV Telugu Site icon

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్.. నిందుతుల పాస్‌పోర్ట్ సీజ్

Tspsc Paper Leak

Tspsc Paper Leak

TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ముగ్గురికి నిందుతులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రేణుక,డి రమేష్, ప్రశాంత్ రెడ్డి లకు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ముగ్గురి నిందుతుల పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని పోలిసులకు అదేశాలను జారీ చేసింది. మూడు నెలల వరుకు ప్రతి సోమ, బుధ, శుక్రవారం లో సీట్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

రేణుక, లవుద్యావత్ డాక్యా ప్రధాన నిందితులు

టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి ప్రవీణ్‌ వ్యక్తిగత సహాయకుడు లీకేజీకి కారణమని.. రేణుక, లవుద్యావత్ డాక్యా ప్రధాన నిందితులుగా ఉన్నారు. కాగా… రేణుకాది గండిఎడ్‌ మండలం మన్సూర్‌పల్లి తండా.. అదే మండలానికి చెందిన డాక్యాది పంచాంగల్‌ తండా. డాక్యా బీటెక్ పూర్తి చేసి దాదాపు 15 ఏళ్లుగా టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. 2018లో వనపర్తిలోని గురుకుల పాఠశాలలో హిందీ పండిట్‌గా ఉద్యోగం రావడంతో మూడేళ్ల క్రితం రేణుక మహబూబ్‌నగర్‌కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం రేణుక వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం గురుకులంలో పని చేస్తోంది. అయితే టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో రేణుక ప్రవీణ్‌తో సన్నిహితంగా మెలిగింది. ప్రవీణ్‌కి ఆమె తన ఫోన్‌ నంబర్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ ఆమెకు తరచూ ఫోన్ చేసేవాడని సమాచారం. ఆ తర్వాత తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో రేణు పలుమార్లు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చింది. TSPSC పేపర్ లీక్ చేయాలని రేణుక, ఆమె భర్త ప్లాన్ చేసుకున్నారు. ప్రవీణ్‌తో రేణుకు ఉన్న సన్నిహిత సంబంధంతో ముగ్గురు కలిసి TSPSC పేపర్‌ను లీక్ చేశారు.

రేణుకతో ప్రశాంత్ రెడ్డి

TSPSC పేపర్ లీక్ కేసులో మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకర్ నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసినట్లు సిట్ నిర్ధారించింది. రేణుకతో ప్రశాంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీశారు. ప్రశాంత్ రెడ్డి ఉపాధి హామీ పథకం ఉద్యోగులని గుర్తించారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్

టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ గ్రూప్ 1 పేపర్ లీక్‌ను గుర్తించారు. అయితే ఉన్నతాధికారులకు చెప్పే భయంతో ప్రవీణ్ , రాజశేఖర్ లు షమీ, రమేష్ లను ఎర వేశారు. అలాగే గ్రూప్ 1 పేపర్ ఇస్తారని, మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించుకోవచ్చని ఆశపడ్డారు. ఆ విధంగా షమీ, రమేష్‌లకు గ్రూప్‌ 1 పేపర్‌ కూడా పంపారు. వీరిద్దరూ న్యూజిలాండ్‌లోని ప్రశాంత్‌కు, సైదాబాద్‌కు చెందిన సురేష్‌కు పేపర్‌ను లీక్ చేశారు. కాగా, ఈ ముగ్గురికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంచలనంగా మారింది.
Minister Kakani Govardhan Reddy: పవన్‌కు 10 పంటలు చూపిస్తే 5 కూడా గుర్తుపట్టలేడు..