Site icon NTV Telugu

Nama Nageswara Rao : కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి

తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. బయ్యారం, ఖమ్మం ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని సర్వేలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు మీద కూడా కేంద్రం మెలికలు పెట్టిందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాత్రమే జాతీయ రహదారుల ఏర్పాటు కోసం భూ సేకరణ వ్యయంలో 50 శాతం వాటా రాష్ట్రం మాత్రమే భరించేలా చేసారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రం అవసరాల కోసం కేంద్రం కోసం ఎప్పుడు అయిన కిషన్ రెడ్డి మాట్లాడారా ? అని ఆయన ప్రశ్నించారు. మేము తెలంగాణ కోసం పార్లమెంటులో మాట్లాడితే అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకువస్తే దండ వేసి దండం పెడతామని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ ప్రజావ్యతిరేక పాలన చేస్తోందని ఆయన అన్నారు. రైతులకు, నిరుద్యోగులకు, సామాన్యుడికి కూడా బడ్జెట్‌తో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆయన అన్నారు.

https://ntvtelugu.com/the-fever-survey-was-ideal-for-the-country/
Exit mobile version