తెలంగాణ మీద కక్ష తోనే కేంద్రం సహకరించడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఆయన మండిపడ్డారు. బయ్యారం, ఖమ్మం ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని సర్వేలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు మీద కూడా కేంద్రం మెలికలు పెట్టిందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మాత్రమే జాతీయ రహదారుల ఏర్పాటు కోసం భూ సేకరణ వ్యయంలో 50…