NTV Telugu Site icon

Nagarjunasagar Dam: తెలంగాణ స్పెషల్ ఫోర్స్ చేతుల్లోకి నాగార్జునసాగర్ డ్యాం భద్రత..

Nagarjuna Sagar

Nagarjuna Sagar

నాగార్జునసాగర్ డ్యాం భద్రత తెలంగాణ స్పెషల్ పోలీస్ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పటివరకు భద్రత విధులు నిర్వహించిన కేంద్ర పారా మిలిటరీ బలగాలు వెనక్కి వెళ్లడంతో… ఎస్పీఎఫ్ డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజు నాగార్జునసాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను రంగాల్లోకి దింపింది.

Read Also: Winter: చలికాలంలో సాయంత్రం వాకింగ్‌తో కలిగే లాభాలివే!

ఫలితంగా గత ఏడాది డిసెంబర్ 3న నాగార్జునసాగర్ డ్యాం ఏపీ, తెలంగాణ రెండువైపులా కేంద్ర బలగాలు మోహరించాయి. నాగార్జునసాగర్ డ్యాంను తమ అధీనంలోకి తీసుకొని భద్రత విధులు నిర్వహించాయి. గత కొద్దిరోజుల క్రితం భద్రత విధుల నుండి కేంద్ర బలగాలను ఉపసంహరించాలని నిర్ణయం తీసుకోవడంతో.. తాజాగా కేంద్ర బలగాలు వెనక్కి వెళ్లిపోయాయి.

Read Also: Pushpa 2: పుష్ఫ 2 సినిమాలో ఓ ఊపు ఊపిన పాట.. ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేదోచ్..

Show comments