NTV Telugu Site icon

Nagarjuna Sagar: నిండు కుండలా సాగర్.. 26 గేట్లు ఓపెన్‌

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు 2.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, రిజర్వాయర్‌ నుంచి అదే స్థాయిలో విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు… కాగా.. ప్రస్తుత నీటి మట్టం 589.50 అడుగులకు చేరింది. దీంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

Read also: PM Modi: నేడు ముంబైలో మోడీ పర్యటన.. రూ.76,000కోట్ల ప్రాజెక్ట్ కు శంకుస్థాపన

సాగర్ కు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 311.14.టీఎంసీలు.. ఇక ఇన్ ఫ్లో:3,45,795..క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 3,45,795.క్యూసెకులుగా కొనసాగుతుంది. మరోవైపు కృష్ణా దిగువ ప్రాంతంలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Read also: Water Supply: గమనిక.. నగరంలో నీటి సరఫరా బంద్‌..

మరోవైపు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కు కొనసాగుతున్న భారీ వరద కొనసాగుతుంది. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం :700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం:699.350 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం :7.603 టీఎంసీలు.. ఇక ప్రస్తుత నీటి నిలువ: 7.432 టీఎంసీ.. అయితే.. ఇన్ ఫ్లో: 25403  క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో: 21749 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Sreeleela: స్పీడ్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదుగా..

Show comments