NTV Telugu Site icon

Nagarkurnool: దవాఖానలో గుంపులుగా వీధి కుక్కలు.. భయాందోళన లో పేషెంట్లు

Nagarkurnool

Nagarkurnool

Nagarkurnool: ఆస్పత్రిలో కుక్కలు సంచరిస్తుండటంతో రోగులు భయాందోళనకు గురవుతున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం జనరల్‌ దవాఖాన, ప్రాంగణంలో వీధి కుక్కలు స్వైర విహారంతో పేషెంట్లు బెంబేలెత్తుతున్నారు. దాదాపు ఏడు వీధి కుక్కలు దవాఖానలోకి ప్రవేశించాయి. కుక్కల ఒకే సారి గుంపులుగా వచ్చి ఆస్పత్రి ఓపీ గది ముందు సంచరించాయి. చాలా సేపు ఓపీ గది ముందు బైఠాయించాయి. అనంతరం ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ రోగులను భయాందోళనకు గురిచేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కుక్క కనిపిస్తేనే భయంతో పరుగులు పడతాం.. అలాంటిది ఆసుపత్రిలో ఒకే సారి కుక్కల గుంపును చూసిన ఓ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు పెట్టాడు.

ఆసుపత్రి సిబ్బంది కుక్కల గుంపును వెళ్లగొట్టకపోవడంతో రోగులు, వారి బంధువులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల గుంపు ఆస్పత్రి వార్డుల్లో తిరుగుతూ రోగుల ఆహారం లాక్కెళ్లి తింటున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మరోవైపు ఆడుకుంటున్న చిన్నారులపై వీధికుక్కలు దాడి చేసిన ఘటన వనపర్తి జిల్లా అమరచింతలోని శ్రీకృష్ణనగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు అభినాష్, అక్షయ్ కుమార్ ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేశాయి. అక్షయ్ కుమార్ ఎడమ చెవిపై, అభినాష్ వీపుపై గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం అక్షయ్‌కుమార్‌ను మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా, అభినాష్‌కు స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. కాలనీలో వీధికుక్కల బెడద ఎక్కువైందని, మున్సిపల్ అధికారులు వీటిని నగరానికి దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
Khairatabad Ganesh: హుస్సేన్ సాగ‌ర్ నుంచి ఖైరతాబాద్‌ గణపతి అవ‌శేషాల తొల‌గింపు..