Site icon NTV Telugu

Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి పర్యటన..

Cm Reanht Reddy

Cm Reanht Reddy

Revanth Reddy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఇవాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హెలికాప్టర్‌లో కల్వకుర్తికి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం వరకు కల్వకుర్తిని సందర్శిస్తారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆవరణలో జైపాల్‌రెడ్డి సంస్మరణ సభ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అలాగే శ్రీశైలం హైవేలోని కొట్రా సర్కిల్‌లో కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని రేవంత్‌ ఆవిష్కరిస్తారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని కల్వకుర్తిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి పక్కన వెల్దండ మండలం కొట్ర గేటు వద్ద విగ్రహావిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొంటారు. అంతకుముందు బీఎస్‌ఎన్‌ఎల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Read also: MLA Raja Singh: ఢిల్లీలో జరిగింది.. తెలంగాణలో కూడా జరగవచ్చు..

ఈ సభకు దాదాపు 25 వేల మందిని సమీకరించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం తన స్వస్థలమైన కల్వకుర్తికి రానున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కెఎల్‌ఐ డి-82 కెనాల్‌తోపాటు ఉప కాల్వల పూర్తి చేయడం, పెండింగ్‌లో ఉన్న భూ నష్టపరిహారం మంజూరు, వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తారని భావిస్తున్నారు. కేఎల్‌ఐ డీ-82లో భాగంగా రూ.80 కోట్ల భూ నష్ట పరిహారం పెండింగ్‌లో ఉంది. 254 ఎకరాలకు గాను రైతులకు రూ.20 కోట్లతో టోకెన్ సిద్ధం చేసి ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరో 300 ఎకరాలకు సంబంధించి సుమారు రూ.60 కోట్లకు ప్రతిపాదనలు రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిహారం మంజూరు చేస్తారనే ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వీటిపై సీఎం ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.
Mallu Bhatti Vikramarka: బోనాల జాతర కు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది..

Exit mobile version