Shocking : నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో సగం కాలిన ఒక మహిళ మృతదేహం గుర్తించడంతో కలకలం రేగింది. అడవిలో దుర్వాసన వస్తోందని గుర్తించిన గ్రామస్థులు దగ్గరగా వెళ్లి చూసే సరికి భయానక దృశ్యం కనబడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, పెంట్లవెల్లి పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
మృతదేహం తీవ్రంగా కాలిపోవడంతో మహిళ ఎవరో గుర్తించడం సాధ్యంకాలేదు. శరీరం పక్కన ఎలాంటి వస్తువులు లభించకపోవడంతో పోలీసులు మృతురాలి గుర్తింపు కోసం సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారాన్ని పంపించారు. అలాగే మిస్సింగ్ కేసుల రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. మహిళ హత్యకు గురై ఉంటుందా, లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించి ఆధారాలను సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో మంచాలకట్ట పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. అడవుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!
