భాగ్యనగరంలోని ముస్లిం సంఘాలు బంద్ కు పిలుపునిచ్చారు. పాతబస్తీలో మసీదు, కమిటీలు, మత పెద్దలతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తమకు నిరసనలు తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ముందస్తుగా పాతబస్తీలో భారీగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రంగంలోకి రాపిడ్ యాక్షన్ ఫోర్స్ దిగింది. చార్మినార్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గత శుక్రవారం ప్రార్థనలు చేసిన తర్వాత ఒక్కసారిగా ముస్లింలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. రోడ్లపైకి ఒక్కసారిగా ముస్లింలు రావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈరోజు శుక్రవారం కావడంతో ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Agneepath Scheme: సికింద్రాబాద్ విధ్వంసంపై స్పందించిన రేవంత్
