NTV Telugu Site icon

Munugode Bypoll: మునుగోడులో బీసీ కార్డ్ వర్కవుట్ అయ్యేనా?

Munugode1

Munugode1

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికకి మించిన హాట్ టాపిక్ లేదనే చెప్పాలి. అక్కడ బీసీ సామాజిక వర్గం కార్డు పనిచేస్తుందా? పార్టీ అభ్యర్థులంతా రెడ్డి సామాజిక వర్గం వారే. బీసీ కార్డుతో ముందుకెళ్లే పార్టీలకు ఓటర్లు మొగ్గు చూపుతారా? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. అయితే అక్కడ పోటీపడుతున్న రాజకీయ పార్టీ నేతలందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. మరి అక్కడ బీసీ కార్డుని ఉపయోగిస్తే ఆ బీసీ కార్డు ఉపయోగించిన పార్టీలకు ఓట్లు రాలుతాయా? అలా ఓట్లు రాలి బీఎస్పీ ప్రజాశాంతి లాంటి పార్టీలు లబ్ధి పొందుతాయా?

రాజకీయ పార్టీలకు నల్గొండ జిల్లాలో జరుగుతున్న మూడవ ఉపఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.. మరో ఏడాది కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎప్పుడు ఈ మునుగోడు ఎన్నిక రాజకీయ పార్టీలకి కీలకంగా మారుతుంది . ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారికి భవిష్యత్తులో అధికారం లభిస్తుందని_ప్రచారం కూడా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మునుగోడు ఎన్నికల్లో హోరాహోరీ పోరాటం చేసి గెలుపొందాలని మూడు ప్రధాన రాజకీయ పక్షాలు తమ ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నాయి. దీనికోసం కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మునుగోడులో ఓట్లని కొనుగోలు చేసే కాలం ప్రారంభమైంది.

తాము చేస్తున్న పనులు. అభివృద్ధి ప్రజలకు ఏమి చేస్తామో చెప్పి పార్టీలు ఓట్లు అడగటం అది మొన్నటి మాట. ఇప్పుడు మాత్రం ఆ విధంగా కాకుండా రాజకీయ పార్టీలు డబ్బుని అధికారాన్ని మాత్రమే నమ్ముకున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ టిఆర్ఎస్ డబ్బుని తమకున్న అధికారాన్ని పోలీసు బందోబస్తుని వినియోగించుకుంటుందని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా డబ్బుని పూర్తిగా నమ్ముకుంది. సానుభూతితో తాము అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని తమ గెలుపునకు మార్గం సుగమం అవుతుందని కాంగ్రెస్ భావిస్తుంది.

టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు డబ్బుని నమ్ముకుంటే కాంగ్రెస్ మాత్రం కుటుంబ నేపథ్యాన్ని నమ్ముకుంది. అయితే ఈ మూడు పార్టీలు పోటీలు పడుతున్నప్పటికీ మూడు పార్టీల అభ్యర్థులు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావటం ప్రధాన అంశంగా మారింది. అయితే ఆ మూడు పార్టీలలో అభ్యర్థులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు తమకే సీట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిష్టానంపై ఒత్తిడి చేశారు. ఒక్కో పార్టీలో ముగ్గురు నలుగురు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సీట్ల కోసం అధిష్టానంపై పోరాటం చేశారు.

మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలు ముగ్గురికి పైగా తమకే సీటు కావాలని ఒత్తిడి చేశారు. అయితే అధిష్టానం వీరి ఒత్తిడి మాత్రం పట్టించుకోలేదు. నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నుంచి సీటును ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం రెడ్డి వర్గానికి చెందిన పాల్వాయి స్రవంతికి మాత్రమే సీటు ఇచ్చింది. దీంతో ఇప్పుడు గౌడ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా స్రవంతి వెంట తిరుగుతున్నప్పటికీ వారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారా.. వారికి ఇచ్చిన హామీలను బీసీ వర్గాలు నమ్ముతాయా అనేది ప్రశ్నార్ధకం.

Read Also: Anasuya Sister: జబర్దస్త్‌లో అక్క అనసూయ స్థానాన్ని చెల్లెలు భర్తీ చేయబోతుందా?

మునుగోడు నియోజకవర్గంలో రెండు లక్షల 25 వేల మంది ఓటర్లు ఉండగా అందులో లక్షా పదివేల మంది మహిళలు ఉన్నారు. మొత్తం మీద 90 వేల మందికి పైగా ఓటర్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో బీసీ కార్డుతో ఎన్నికల రంగాల్లోకి దిగుతున్న వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయా అనే చర్చ కూడా సాగుతుంది. ప్రస్తుతం బీఎస్సీ నుంచి బీసీ అభ్యర్థిగా శంకరాచారి రంగంలోకి రాగా అదే విధంగా ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ బరిలో వున్నారు. ఈ పరిస్థితుల్లో బీసీ ఓటర్లంతా అగ్రవర్ణాలని కాదని మిగిలిన వర్గాల వైపు వెళ్తారా అనే చర్చ సాగుతుంది.

కాంగ్రెస్ నే కాదు టిఆర్ఎస్ లో కూడా బీసీ కార్డ్ వివాదం కొనసాగుతుంది . టిఆర్ఎస్ లో మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత నియోజకవర్గం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బీసీ వర్గాలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఎంత మేరకు సహకరిస్తాయన్న మీమాంస కనిపిస్తోంది. మునుగోడులో బీసీ వర్గాలని ప్రధానమైన రాజకీయ పక్షాలు అణగదొక్కటానికి ప్రయత్నాలు చేశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు పార్టీలు కూడా బీసీలకు ఏమాత్రం ప్రాథమిక ఇవ్వలేదని ఆ నేపథ్యంలో బీసీ వర్గాల్లో ఆగ్రహం ఉందని అంటున్నారు. బీసీలను పట్టించుకోకుంటే ఫలితం ఎలా వుంటుందో చూపిస్తామని వారంటున్నారు. బీసీలు ఓటేస్తేనే మునుగోడులో పార్టీలు విజయం సాధిస్తాయంటున్నారు.

(ఖమ్మం ప్రతినిధి భూపాల్ సౌజన్యంతో…)

Read Also: AshokGajapathi Raju: ఏపీలో రాజ్యాంగం అమలు కావడంలేదు