Municipal workers: కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో మున్సిపల్ కార్మకులు నిరసన బాట పట్టారు. విధులు బహిష్కరించి వేతన బకాయిల కోసం ఆందోళన చేపట్టారు. అధికారుల వద్ద నుంచి ఎలాంటి స్పందన లేకపోవంతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వేతన బకాయిలు చెల్లించాలని నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీల విధులకు హాజరయ్యారు. వేతనాలు బకాయిలు చెల్లించాలని ఎన్ని సార్లు విన్నవించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు అధికారులకు తమ గోడు తెలిపిన అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. పూట గడవాలంటే జీతాలు రాక ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తెలిపారు. నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసనలు తెలిపిన అధికారులు స్పందించలేదని చేసేది ఏమీలేక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టామని తెలిపారు. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్
తాజాగా.. మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని మణుగూరు పురపాలక సంఘం పారిశుధ్య కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వకపోగా రెగ్యులర్ జీతాలు కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలో, మూడు మున్సిపాలిటీలో పెంచిన జీతాలు ఇస్తున్నారని. ఇక.. మణుగూరు లోనే పెంచిన జీతాలు లేవని, పాత జీతాలు లేవని కమిషనర్ ని నిలదీశారు. ఇక్కడికి కమిషనర్‌లు వస్తున్నారు, పోతున్నారు కానీ.. మా బాధలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మా కుటుంబాలని ఎలా పోషించుకోవాలని తమ గోడు వెల్లడించారు. అయితే దీనిపై మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణను వివరణ కోరగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న ఈ ఆందోళన సరైన పద్ధతి కాదని.. జనవరి నెల జీతాన్ని మాత్రమే పెండింగ్‌లో ఉంచుతున్నారని అన్నారు. పెండింగ్‌లో ఉన్న నెల జీతం చెక్కు సిద్ధంగా ఉంది. మన తప్పేమీ లేదని ఫైనాన్స్ నుంచే రావాలని స్పష్టం చేశారు.
Fire Accident: కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం.. మూడు బస్సుల్లో చెలరేగిన మంటలు..