Municipal Elections Update: ముగిసిన ఉపసంహరణ గడువు.! రాత్రికి ఎస్ఈసీ కీలక ప్రకటన!

  • ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ గడువు
  • ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించనున్న ఎస్ఈసీ
  • స్వతంత్ర అభ్యర్ధులకు గుర్తులు కేటాయించనున్న ఎస్ఈసీ
Municipal Elections

Municipal Elections

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు నిర్దేశించిన గడువు నేటితో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అభ్యర్థుల తుది జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ రాత్రి లోపు లేదా రేపు ఉదయానికల్లా అధికారికంగా పోటీలో ఉన్న అభ్యర్థుల పూర్తి వివరాలను ఎస్ఈసీ ప్రకటించనుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ , బీజేపీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉన్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Pakistan: ‘‘మా సైన్యం వల్ల కావడం లేదు’’.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

పార్టీల తరపున పోటీ చేసే వారికి ఆయా పార్టీ గుర్తులు ఉండగా, భారీ సంఖ్యలో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించే ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించారు. ఈ రాత్రి వరకు స్వతంత్ర అభ్యర్థులందరికీ ఎన్నికల చిహ్నాలను కేటాయించి, వారికి ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు. ఎన్నికల గుర్తు పొందిన వెంటనే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగనుండగా.. ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఫిబ్రవరి 13 వెలువడనున్నాయి.

Parliament Budget Session: లోక్‌సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్..