NTV Telugu Site icon

Mulugu: పేరూరు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Mulugu

Mulugu

Mulugu: ములగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో గత రెండు రోజులు గా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ చత్తీస్గడ్, మహారాష్ట్ర కురిసిన భారీ వర్షాలకు గాను గోదావరి నదిలోకి భారీ వరద నీరు చేరింది. కాగా.. వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతుంది. గోదావరి ఎగువ పోటుతో రహదారులు అన్ని జలమయమయ్యాయి. వెంకటాపురం నుండి భద్రాచలం వెళ్లే మార్గంలో భోదాపురం ,కుక్కతోగు ,బల్లకట్టు ఉదృతంగా ప్రవహించడంతో ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంపుకు గురైన 163 జాతీయ రహదారి వాజేడు మండలం టేకులగూడెం వద్ద గండి మరి మాగు వాగు పొంగడంతో గత 12 రోజులుగా తెలంగాణ – చత్తీస్గడ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు భారీగా నిలచాయి. అటువైపు ఎవరు వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసి పోలీసు బలగాలు భద్రత కల్పిస్తున్నారు.

Read also: Shiva Nursing Home: ఆసుపత్రి వద్ద ఆందోళన.. ఫ్యామిలీ ప్లానింగ్‌ వికటించి వివాహిత మృతి..

రెండో ప్రమాదక హెచ్చరికకు చేరువలో వాజేడు పేరూరు ముళ్లకట్ట వద్ద ఉదృతంగా గోదావరి ప్రవహిస్తుంది. పేరూరు చెండ్రుపట్ల మధ్య బ్రిడ్జిపై చేరిన వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాజేడు మండలం తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బోగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు వరద నీ చేరడంతో అటవీశాఖ అధికారులు పర్యాటకుల భద్రత దృష్ట్యా బోగత జలపాతం అనుమతించడం లేదు. వెంకటాపురం మండలం నిండికుండలా పాలెం వాగు జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్న పాలెం వాగు అధికారులు. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. మండల పరిధిలోని రేగుమాగు వాగు ,గుమ్మడి దొడ్డి వాగు, కొంగల వాగు , చీకుపల్లి వాగు, కంకల వాగు, బల్లకట్టు , కుక్కతోగూ , జిన్నాల వాగు , పెంకవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు వరదల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కుంటలు వాగులకు చేపల వేటకు వెళ్లొద్దని సూచించిన పోలీసు ఉన్నతాధికారులు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకి రావద్దని సూచించుతున్న అధికారులు.
Building Collapses: ముంబైలో కూలిన మూడు అంతస్థుల భవనం.. శిథిలాల కింద పలువురు..!