NTV Telugu Site icon

Mulugu Doctors: డాక్టర్ సాహసాని సలామ్.. వాగులు దాటుకుంటూ వైద్యం..

Mulugu Doctor

Mulugu Doctor

Mulugu Doctors: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా మందులే దిక్కు. దట్టమైన అడవుల్లో రవాణా సౌకర్యాలు లేవు.. వైద్యం అందించేందుకు వైద్యులు ముందుకు రావడం లేదు. కానీ, ఓ వైద్యాధికారి వృత్తి పట్ల మానవత్వంతో పాటు కరుణ, నిబద్ధత ప్రదర్శించారు. కొండలు, వాగులు దాటి వైద్య సేవలు అందించారు. ముగ్గురు గ్రామస్థుల సహాయంతో, వైద్య సిబ్బంది ప్రమాదకరమైన నడుము లోతు వాగులను దాటి ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని వైద్యుని సాహసానికి అందరూ సలామ్ చేస్తున్నారు.

Read also: Mallu Bhatti Vikramarka: రుణమాఫీ డబ్బులు రైతుల అప్పులకు మళ్లించొద్దు.. బ్యాంకర్లకు భట్టి వార్నింగ్..

ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి మధుకర్‌ వైద్యం అందజేస్తున్నారు. అయితే.. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలోని గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన ప్రజలు జర్వం బారిన పడ్డారని, వారికి సరైన వైద్యం అందడం లేదని చెప్పడంతో రోగుల కోసం రంగంలోకి దిగాడు వైద్యాధికారి మధుకర్‌. అంతేకాదు తన ఆధ్వర్యంలో వైద్య బృందమైన హెల్త్ అసిస్టెంట్లు చిన్న వెంకటేశ్వర్లు, కోరం శేఖర్, ల్యాబ్ టెక్నీషియన్ ఇర్ప రజినీకాంత్, సిబ్బంది లకన్, ప్రశాంత్, ఆశ వర్కర్ సమ్మక్క, గుమ్మడిదొడ్డి గ్రామస్తులు కారం ఆదినారాయణ, జజ్జేరి అశోక్ అనుతీసుకుని కాలినడకన పయనమయ్యారు. మూడు వాగులు దాటి మూడు కొండలు ఎక్కి 16 కిలోమీటర్ల కాలినడకన సాయంత్రానికి పెనుగోలు చేరుకున్నారు.

Read also: TG DSC Exams: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి..

అక్కడ నివసిస్తున్న 10 కుటుంబాలకు చెందిన 39 మందికి వైద్య పరీక్షలు చేశారు. జ్వరంతో బాధపడుతున్న ముగ్గురిని గుర్తించి మందులు అందజేశారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ దోమలపై పిచికారీ చేశారు. వర్షాకాలంలో జ్వరాలపై జాగ్రత్తలను సూచించారు. మరి పెనుగోలు నుంచి తిరిగి పయనమయ్యారు. బుధవారం మధ్యాహ్నం పీహెచ్‌సీకి చేరుకున్నారు. అంతేకాకుండా.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం పీహెచ్‌సీ పరిధిలోని మట్టెవాడ శివారు తిమ్మాపురం గ్రామానికి వాగులు, వంకలు దాటి 8 కిలోమీటర్లు నడిచి బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దేవేందర్, నరేష్, సిబ్బంది లోక్యానాయక్, అరుణ, హేమలత, రజిత, సర్దార్, లాలు, కవిత, ఆశ, సీతమ్మ పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్ యమున మాట్లాడుతూ గిరిజనులు అటవీ ప్రాంతాల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. 42 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
Covid-19 : అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ కు కోవిడ్ పాజిటివ్