NTV Telugu Site icon

Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Encounter

Encounter

తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత బద్రు సహా ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఘటన స్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.