Site icon NTV Telugu

Big Shock To Maoists: ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ షాక్.. 20 మంది అరెస్ట్

Moites

Moites

Big Shock To Maoists: ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సుమారు ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా, మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శబరిష్ ఎదుట వివిధ హోదాల్లో పని చేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నక్సలైట్లు సుముఖత చూపిస్తున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న పోరు కన్నా-ఊరు మిన్న.. మన ఊరుకి తిరిగు రండి అనే కార్యక్రమంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి.

Read Also: Anchor Shyamala: ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం!

అయితే, లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు 24 గంటల్లో వారీ ఆకౌంట్లో జమ చేస్తున్నామని ఎస్సీ శబరిష్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసం కల్పించి అన్ని విధాల ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి అని పిలుపునిచ్చారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్.

Exit mobile version