Road Accident: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంలో ఆటో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 16 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Harassing: బల్దియా ఉద్యోగినిపై వేధింపులు.. మహిళలు లేని చోటుకు ట్రాన్స్ ఫర్ చేయాలని..
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమీపంలో పంటలు వేసేందుకు గోవిందరావుపేట మండలం మద్దుల గూడెం గ్రామానికి చెందిన 17 మంది కూలీలను టీఎస్ 28టీ 2286 నంబర్ గల ఆటోలో డ్రైవర్ తీసుకెళ్తున్నాడు. అయితే డ్రైవర్ అతి వేగంతో ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో నార్లాపూర్ సమీపంలోకి రాగానే పీహెచ్‌సీ వద్ద మూల మలుపు వద్ద ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన సునీత(38) అక్కడికక్కడే మృతి చెందింది.మరో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడగా, జ్యోతి, బోగమ్మ, విజయ, లలిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మేడారం డ్యూటీలో ఉన్న సీఐ రవీందర్, ఎస్సై వెంకటేశ్వర్లు క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Kidnapping: చాకెట్లు కొనిస్తానని కిడ్నాప్.. చాకచక్యంగా బయటపడ్డ చిన్నారులు