NTV Telugu Site icon

ప్రధాని ఇలా మాట్లాడటం సిగ్గు చేటు : టీఆర్‌ఎస్‌ ఎంపీ

ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ ఎంపీ నేతకాని వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ప్రధాని రాజ్యసభ లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అవాస్తవాలను, ఈర్ష్య, ద్వేషాలను కక్కారని ఆయన అన్నారు. ప్రధాని ఇలా మాట్లాడటం సిగ్గు చేటు ఆయన విమర్శించారు. మోడీ వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ ఎంపీలం ఖండిస్తున్నామని ఆయన వెల్లడించారు. బీజేపీ నాయకులు అబద్దాలు చెప్పటం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయటం అలవాటైందన్నారు.

గ్లోబెల్స్ ప్రచారంలో మోడీకి నోబెల్స్ ప్రైజ్ అని ఆయన ఎద్దేవా చేశారు. అబద్దాలలో బీజేపీకి ఆస్కార్ ఇవ్వొచ్చునని ఆయన అన్నారు. అంతేకాకుండా మోడీ, బీజేపీలకు రాష్ట్రపతి పై ఉన్న గౌరవం అర్ధమవుతోందని ఆయన మండిపడ్డారు. నియంతృత్వ పాలన మోడీ, బీజేపీది అని ఆయన విమర్శించారు. వ్యవసాయ చట్టాలపై చర్చ జరిగిందా, బీజేపీకి, మోడీకి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, విభజన చట్టంలో ఒక్క హామీని అయినా నెరవేర్చారా అని ఆయన ప్రశ్నించారు.