Site icon NTV Telugu

Uttam Kumar: తిమ్మారెడ్డిగూడెం ఘటన.. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి లేదంటే దీక్ష చేస్తాం

Uttamkumar Reddy

Uttamkumar Reddy

Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గ్రామంలో ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్‌రెడ్డిని ఎస్‌ఐ లోకేష్‌ అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డిపై దాడి చేసిన ఎస్‌ఐ లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఎస్పీలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈరోజు సాయంత్రంలోగా ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్ ఐపై చర్యలు తీసుకోకుంటే రేపు కోదాడలో దీక్ష చేపడతామని హెచ్చరించారు.

Read also: Baby girl for sale: మారని తీరు.. ఒకరు వదిలేసారు.. మరొకరు అమ్మేసారు

తిమ్మారెడ్డి గ్రామంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా హాజరయ్యారు. కాగా, కార్యక్రమానికి హాజరైన ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్ రెడ్డి జైభీమ్ అంటే ఏమిటో చెప్పాలని అక్కడున్న కళాకారులతో ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తనపై ఎస్‌ఐ లోకేష్‌, ఇతర పోలీసులు పిడిగుద్దులతో దాడి చేశారని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీటీసీనని చెప్పినా వినకుండా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసుల దాడిలో కుడికంటికి తీవ్ర గాయమైందని తెలిపారు. ఇది ఇలా ఉండగా తాను ఎవరిపై దాడి చేయలేదని మునగాల ఎస్సై లోకేష్ వివరణ ఇచ్చారు. సభను అడ్డుకోవడంతోనే వారిని అక్కడి నుంచి తరలించామని దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.

Exit mobile version