Site icon NTV Telugu

Mp Santhosh Kumar: వీక్లీ డోస్ లో అద్భుతమయిన పక్షి ఫోటోలు

Santhosh

Santhosh

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ (Mp Santhosh Kumar) . నిత్యం సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా వుంటారు. తన కెమెరా కన్నులతో బంధించిన అందమైన పక్షులు, జంతువుల ఫోటోలను ప్రతీ ఆదివారం వీక్లీ డోస్ ఆఫ్ మై ఫోటోగ్రఫీ పేరుతో ట్విట్టర్ ద్వారా షేర్ చేసే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ వారం మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

Read Also: Prashanth Kishor: నితీష్‌కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు..

లేత పెసర పంటను నోట కరుచుకుని వచ్చి ఓ చెక్క కొయ్యకు వేలాడదీసి ఆహారంగా తీసుకుంటున్న అందమైన ఇండియన్ వైట్ ఐ (The Indian White-eye, formerly the Oriental white-eye) పక్షి ఫోటోలను ఎంపీ ఈ వారం పోస్ట్ చేశారు. మిగతా ప్రపంచంతో నాకు సంబంధం లేదు అంటూ ప్రకృతిలో పరవశిస్తున్నట్లుగా పక్షి ఫోటోలు ఉన్నాయి. ఇండియన్ వైట్ ఐ పక్షులు ఎక్కువగా భారతదేశం, ఫిలిఫీన్స్ తో పాటు, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు ఉండే దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి.

Read Also: AyannaPatrudu: తప్పులు దిద్దుకోమంటే దాడులా?

Exit mobile version