Run For Peace: బొటానికల్ గార్డెన్ లో రన్ ఫర్ పీస్.. నిర్వాహకులకు ఎంపీ సంతోష్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాంధీ జయంతి నాడు బొటానికల్ గార్డెన్ లో నిర్వహించిన రన్ ఫర్ పీస్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వాహకుల్ని అభినందించారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10K, 5K, 3K రన్ ఫర్ పీస్ లో వేలాదిమంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ నిర్వహించడం చాలా శుభ పరిణామం అని దీనికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also: Mla Jaggareddy: VRAలకు దసరా గిఫ్ట్ ఇవ్వండి కేసీఆర్
Also Read
ప్రతిరోజు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండే మనం వ్యాయామం చేయడం మర్చిపోతున్నామని కానీ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ గార్డెన్ అభివృద్ధి కోసం అసోసియేషన్ వారు చాలా కృషి చేస్తున్నారని వారికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ గార్డెన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల కోసం తన రాజ్యసభ నిధులనుండి 10 లక్షల రూపాయలను కేటాయిస్తున్నానని తెలియజేశారు. సంతోష్ ప్రకటనను స్ఫూర్తిగా తీసుకొని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రెడ్డి, స్థానిక శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కూడా వారి అభివృద్ధి నిధుల నుండి తలా 10 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా అందరు కలిసి పార్కు అభివృద్ధి కోసం 40 లక్షల నిధులు ఇచ్చిన వారందరికీ వాకర్స్ అసోసియేషన్ వారు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, స్పోర్ట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, PCCF డోబ్రియాలు, వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు భరత్ రెడ్డి, బాలకృష్ణ ఏవీ రెడ్డి, పెద్ద ఎత్తున వాకర్స్ పాల్గొన్నారు.
Read Also: Maharashtra: హలోకు బదులు “వందేమాతరం”.. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రచారం
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!