కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ శ్రేణులు అమిత్ షా టూర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే తాజాగా టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పర్యటన అమిత్ షా ఏమి చెబుతారో మాకు తెలుసు అంటూ సైటర్లు వేశారు. అమిత్ షా వచ్చి తెలంగాణలో అప్పుల ఎక్కువ అని, తెలంగాణలో కుటుంబ పాలన ఉందని అమిత్ షా అంటారని ఆయన ఎద్దేవా చేశారు. ఏ మొఖం పెట్టుకుని అమిత్ షా తెలంగాణ వస్తాడు ? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా అమిత్ షా ను కూడా తెలంగాణ ప్రజలను నిలదిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అవినీతి ఉంటే కేంద్ర సర్కార్ ఏమి చేస్తుందని, కేంద్రము తెలంగాణకు ఏమి ఇచ్చిందో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట చేస్తు్న్న రెండో దశ పాదయాత్ర ముగింపు సభను మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించానున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నారు.