NTV Telugu Site icon

చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గి పోలేదు ఇప్పటికీ ఈ మహమ్మారి రూపం మార్చుకుని జూలు విధిలిస్తునే ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావాన్ని చూపిస్తునే ఉంది. తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లారు. దీంతో ఇన్ని రోజులు తనతో తిరిగిన వారు, తన వెంట ఉన్న వారు వెంటనే కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.

కాగా వైద్యుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో చికిత్స తీసుకుంటున్నట్టు రంజిత్‌ రెడ్డి తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో తన సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎంపీ రంజిత్‌ రెడ్డి పేర్కొన్నారు. కరోనాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీ వెల్లడించారు. కాగా ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కూడా కరోనా సోకిన సంగతి తెల్సిందే. ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరూగా కరోనా బారిన పడుతుండటం గులాబీ దళాన్ని కలవరపెడుతుంది. దీంతో నియోజకవర్గంలోని ప్రజా కార్యక్రమాలకు వారు దూరంగా ఉండాల్సి వస్తోంది.