NTV Telugu Site icon

Nama Nageswara Rao: ఎంపీని పిలవకుండా హైదరాబాద్ లో బీజేపీ కార్యక్రమాలు

Mp Nama Nageshwer Rao

Mp Nama Nageshwer Rao

Nama Nageswara Rao: ఎంపీని పిలవకుండా హైదరాబాద్ లో బీజేపీ కార్యక్రమాలు నిర్వహించారని ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. 9 ఏళ్ళ కాలం లో అనేక పథకాలను కేసీఆర్ ప్రవేశ పెట్టారు. వేలాది కోట్ల రూపాయలను పట్టణాల అభివృద్ధికి ఖర్చు చేశారన్నారు. రైతు బిడ్డని.. చిన్నప్పటి నుండి కష్టాలు చుసినవాడిని అని అన్నారు. తెలంగాణా రాకముందు బ్రతుకు దెరువు కోసం వలసలు ఉండేవని తెలిపారు. తెలంగాణ మీద కన్నుగుట్టి అభివృద్ధి నీ ఆపాలని కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు చెపుతుందని తెలిపారు. ఒక ఎంపీ నీ పిలవకుండా హైదరాబాద్ లో బీజేపీ వాళ్ళు కార్యక్రమాలు చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంకు బాకీ ఉన్నారని తెలిపారు. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Solar Eclipse: హైదరాబాద్ వాసులు సూర్యగ్రహణాన్ని చూస్తారా?

ప్రజా ప్రతినిధులను అవమాన పరిచేలా పొంగులేటి మాట్లాడారని ఆగ్రమం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించారని మండిపడ్డారు. చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఖమ్మం జిల్లా నుండి గెలిచి అసెంబ్లీ గేట్ తట్టారు అని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంటే అంత చులకనా…? అని ప్రశ్నించారు. ఇటువంటి పద్దతులు మార్చుకోవాలని, ప్రజాస్వామ్యం లో కరెక్ట్ కాదని హెచ్చరించారు. కేసీఆర్ పై మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. జిల్లాలో నాయకులం అందరం కలిసికట్టుగా 10 స్థానాలు గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ గా ఉన్న మీ హాయంలో ఏ ప్రాజెక్టు తీసుకువచ్చారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఏ ఎన్నికలైన ఖమ్మం ప్రజలు కేసీఅర్ కు అండగా ఉన్నారని తెలిపారు. మిమ్మల్నీ పక్కనపెట్టాకే ఈ రిజల్ట్ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళ్ళ మీద ఎందుకు పడ్డారో తెలియదు అని అన్నారు. ఎంపీ బండి పార్థ సారథి రెడ్డి పై ఓ పార్టీ అధ్యక్షుడు చేసిన మాటలు బాధాకరమన్నారు. అనేక సేవా కార్యక్రమాల చేస్తున్న పార్థ సారథి రెడ్డి పై విమర్శలు చేయటం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Solar Eclipse: హైదరాబాద్ వాసులు సూర్యగ్రహణాన్ని చూస్తారా?

Show comments