Site icon NTV Telugu

BJP MP Laxman: 8 ఏళ్ల నుంచి గిరిజనులకు 10 % రిజర్వేషన్లు జీవో ఎందుకు ఇవ్వలేదు

Bjp Mp Laxman

Bjp Mp Laxman

BJP MP Laxman: 8 ఏళ్ల నుంచి గిరిజనులకు 10 % రిజర్వేషన్లు జీవో ఎందుకు ఇవ్వలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. గిరిజనుల రిజర్వేషన్లపై కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. కాగా.. బీజేపీ స్టేట్ ఆఫీసులో మోడీ ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే జీవోలన్నింటికి కేంద్రం ఆమోదం ఉందా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఎన్టీఆర్ హయాంలో ఒక్క జీవోతో రిజర్వేషన్లు పెంచారని లక్ష్మణ్ అన్నారు. ఇక గిరిజనులకు 10 %రిజర్వేషన్లు జీవో తోనే అమలైతే 8 ఏళ్ల నుంచి జీవో ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ని ప్రశ్నించారు లక్ష్మణ్‌.

రానున్న మునుగోడు ఎన్నికలు వస్తున్నాయనే గిరిజన రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. మనుగోడు ప్రజలను మోసం చేసేందుకు రిజర్వేషన్ల నాటకమని లక్ష్మణ్ మండిపడ్డారు. అయితే.. రిజర్వేషన్లను పెంచడమే కాకుండా దానిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని, లేకపోతే దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఇక కేసీఆర్, కాంగ్రెస్ ఒక్కటేనని.. ఎన్ని అవినీతి పార్టీలు ఏకమైన ప్రజలు మోడీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. అయితే.. కేసీఆర్ ఎన్ని బంధులు తీసుకువచ్చిన రాష్ట్రంలో టీఆర్ఎస్ బంద్ కావడం ఖాయమని లక్ష్మణ్ తెలిపారు.
Hyderabad NIA Office: ఎన్.ఐ.ఏ. విచారణకు 10 మంది యువకులు, వారి తల్లిదండ్రులు

Exit mobile version