NTV Telugu Site icon

Munugode Bypoll: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రచార బాధ్యతలు-రేవంత్‌

Munugode Bypoll

Munugode Bypoll

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది… కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నికలు వస్తుండగా… తమ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి దూకుడు పెంచింది… అధికార పార్టీ కంటే ముందే.. తమ అభ్యర్థిని ప్రకటించింది.. ఇప్పటికే పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్‌ ఇప్పుడు కమిటీలు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తోంది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… మునుగోడు ప్రచార బాధ్యతలు మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డిలకు అప్పగించినట్టు వెల్లడించారు.. దీంతో, తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి పోటీచేస్తుంటే.. అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్‌ తరపున ప్రచారంలోకి దించడం ఆసక్తికరంగా మారింది.. ఇక, మునుగోడు ఉప ఎన్నికలకు అందరినీ సంప్రదించాకే అభ్యర్ధిని ప్రకటించామని.. ఐదు దశాబ్దాలు సేవ చేసిన గాంధీ కుటుంబ సన్నిహితుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సేవలు దృష్టిలో పెట్టుకొని స్రవంతిని అభ్యర్ధిగా ప్రకటించారని తెలిపారు రేవంత్‌రెడ్డి.

Read Also: Twist in Sai Priya Missing Case: సాయిప్రియ మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌.. ప్రియుడే చంపి పూడ్చేశాడు..!

ఇప్పటికే పార్టీ మునుగోడులో సభలు.. రాజీవ్ గాంధీ జయంతిని ఊరూరా నిర్వహించామని.. ప్రతి మండలానికి ఇద్దరు నాయకులను ఇంఛార్జిగా వేశామన్నారు.. బీజేపీ, టీఆర్ఎస్‌లు అకారణంగా ఎన్నికలు తెచ్చాయి.. టీఆర్ఎస్‌ ఇప్పటికీ అభ్యర్దిని ప్రకటించలేని అచేతన స్థితిలో ఉందన్న రేవంత్‌రెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్‌ సభ ముందే పెట్టిందని గుర్తుచేశారు.. అభ్యర్థిని కూడా ప్రకటించాం.. ఇక, టీఆర్ఎస్‌, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్ ని దెబ్బతీయాలని చేస్తున్న కుట్రను ప్రజలకు వివరిస్తాం అన్నారు.. మండలాల వారీగా ఇంఛార్జ్‌లను పెడతామన్న ఆయన.. నాంపల్లికి దామోదర రాజనర్సింహ, చౌటుప్పల్‌కు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మునుగోడుకు మల్లు భట్టి విక్రమార్క, మర్రిగూడకు శ్రీధర్ బాబు, చండూర్‌కు షబ్బీర్ అలీ, గట్టుప్పల్‌కు వీహెచ్‌, నారాయణపురానికి రేవంత్‌రెడ్డి.. చౌటుప్పల్ మున్సిపాల్టీకి గీతారెడ్డి ఇంఛార్జ్‌లుగా ఉంటారని.. ప్రచార బాధ్యతలు… మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి చూసుకుంటారని వెల్లడించారు. ఇక, 10 బూతులకి ఒక్కరినీ ఇంఛార్జి గా పెడతాం.. బీజేపీ, టీఆర్ఎస్‌ అన్యాయం ఎలా చేస్తున్నాయి అనేది జనానికి వివరిస్తామని.. సెప్టెంబర్ 18 నుండి నియోజక వర్గ పరిధిలో పర్యటనలు ఉంటాయని తెలిపారు..